గుండు సూది క్రింద పడిన శబ్దం ఏమి వినిపించడం లేదుకాని, ఫ్యానుగాలికి గోడకు తగిలించిన క్యాలెండరు కొట్టుకుంటూ చేసే చప్పుడు మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. ఊపిరి బిగబెట్టి, రెప్పవేయ్యడం మర్చిపోయి కాసేపు లండన్ ఆర్టు గ్యాలరిలోని మైనపు బొమ్మలు అయిపోయాం మా తరగతి గదిలో అందరం. తలుపులు గడియవేసిన క్లాసులో మేము వింటున్నామో లేదో కూడా పట్టించుకోకుండా సీరియస్గా అయన చెప్పాలనుకున్నది చెప్తున్నారు 'హెడ్ అఫ్ ద డిపార్ట్మెంట్' అయిన ప్రొఫెసర్. విద్యార్దుల్లో భయభక్తులు కోసమే "ఇంటర్నల్ మార్క్స్" "ప్రాక్టికల్ మార్క్స్" లాంటివి ఉంటాయేమో. ఇంతలోనే ఎవరుచేసారో తెలీదుకాని నా వెనుక బెంచిలో కూర్చున్న అనిల్ పెన్నులో రీఫిల్ తీసి దాచేశారు సరదాగా ఆటపట్టించడం కోసం. ఆయన క్లాసు వదిలి వెళ్ళిన తరువాత గంటసేపు ఫ్రీజ్ అయిన మేము మామూలు స్థితిలోకి వచ్చే సమయం ఇవ్వకుండానే క్లాసులోకి వచ్చేశారు అసిస్టంట్ ప్రొఫెసర్ గారు.
అప్పటికి కొన్ని రోజుల క్రితమే అసిస్టెంటు ప్రొఫెసర్ గారికి చిన్న ఆక్సిడెంట్ అయ్యి కుడిచెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. అయినాకూడా ఆయన శెలవు తీసుకోకుండా వచ్చి క్లాసు తీసుకొనేవారు. మా శ్రేయస్సు కోసం ఎడంచేత్తో రైటింగ్ ప్రాక్టీసు చేసేసి బోర్డు మీద ఇంగ్లీషు అక్షరాలను అరబ్బీ లాగ వ్రాసేవారు. ఆయన పాఠం మొదలుపెట్టక రన్నింగ్ నోట్స్ రాసుకోవడం కోసం అనిల్ తన పెన్ను చూసుకున్నాడు.
"ఏటిరా..నా పెన్నులో రీఫిల్ ఏటయిపోనాది.. ఎవడుతీసాడో చెప్పండ్రా" అంటూ హడావిడి చెయ్యడం మొదలెట్టాడు. వెనుక బెంచిల్లో అందరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అప్పుడే మమ్మల్ని చూసిన అసిస్టెంటు ప్రొఫెసర్ గారు, "ఎవరు అక్కడ నవ్వుతున్నారు" అని అడిగారు. ఎవరూ "నేనే నవ్వుతున్నానండి" అని చెప్పరు కదా..! ముందు బెంచిలో కూర్చున్న నన్ను నా ప్రక్కన కమల్ ని నుంచోమన్నారు.
"ఎందుకు నవ్వారో చెప్పు" అని అడిగారు నన్ను.
"నాకు తెలీదండి"
"నా మీద మీరు ఏదో జోక్ వేసుకొని ఉంటారు చెప్పు"
"లేదండి మీ మీద ఏమి జోక్ వేసుకోలేదు.."
"జోక్ కాకపోతే ఎందుకు నవ్వుతారు..?"
"లేదండి మీ మీద జోక్ ఏమి కాదు, ఎవరో అనిల్ పెన్నులో రీఫిల్ దాచేసారుట, అందుకు నవ్వుకుంటున్నారు"
"ఏమ్మా..విజయా పెన్నులో రీఫిల్ దాచేస్తే ఎవరికయినా నవ్వొస్తుందా..!?" అని అడిగారు ఒక అమ్మాయిని.
"రాదు సార్.."
"యూ ఫూల్స్, బొత్ ఆఫ్ యు గెట్-అవుట్ ఆఫ్ మై క్లాస్" అని నన్ను కమల్ ని బయటకు పొమ్మన్నారు అసిస్టెంటు ప్రొఫెసర్ గారు.
చేసేదేమీలేక క్లాస్ రూం మేము తలుపు తీసుకొని బయటకు వెళ్తూంటే అప్పుడే క్లాస్ కి రాబోయింది ఒక అమ్మాయి. పనిలో పనిగా ఆ అమ్మాయికి కూడా చీవాట్లు వేసి పంపించారు.
ప్రొఫెసర్ గారు వేసే ఇంటర్నల్ మార్క్స్, ప్రాక్టికల్ మార్క్స్ తలుచుకొని, మేము తప్పు చెయ్యకపోయినా..సారీ చెప్దాం అని క్లాసు అయ్యాక ఆయన రూంకి వెళ్ళాం. మా గోడు వెళ్ళబోసుకున్నాక ఆయన తాపీగా..,
"రీఫిల్ కోసం మీరు నవ్వారంటే నేను నమ్మను. మీరు నామీద ఏదో జోక్ వేసారు అది చెప్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తా..!" అన్నారు.
"మీ మీద ఎవరూ జోక్ వెయ్యలేదు సార్ "
"సరే పొండి"